సారంగాపూర్, 10 September
మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ 41వ వర్ధంతిని విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఆమెకు నివాళులర్పించారు.
మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి సందర్భంగా నిర్మల్ జిల్లా విశ్వ హిందూ పరిషత్ ప్రఖండ అధ్యక్షులు సత్య ఇర్గదిండ్ల, ప్రధాన కార్యదర్శి మండజీ అరుణ్, బజరంగ్ దళ్ ప్రఖండ అధ్యక్షులు గాంధారి రవి తేజ, సామాజిక సమరసత ప్రతినిధి పిల్లి గంగేష్, రజక సంఘం సభ్యులు మన్కల లక్ష్మణ్, సర్పంచ్ కూనేరు భూమన్న, ఉప సర్పంచ్ కృష్ణ రెడ్డిలు పూలమాలతో నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో వీరంతా పాల్గొన్నారు.












