అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని, రిటైర్డ్ ఉపాధ్యాయుడు సల్ల అమృత్ వృద్ధాశ్రమంలోని వృద్ధులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన వృద్ధులతో ఆప్యాయంగా మాట్లాడి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని, రిటైర్డ్ ఉపాధ్యాయుడు సల్ల అమృత్ ఆధ్వర్యంలో వృద్ధాశ్రమంలోని వృద్ధులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన వృద్ధులతో ఆప్యాయంగా మాట్లాడి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా సల్ల అమృత్ మాట్లాడుతూ, జీవితంలో ఎన్నో అనుభవాలను, విలువలను అందించిన వృద్ధులను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. వృద్ధుల ముఖాల్లో చిరునవ్వు చూడటం, వారికి ఆప్యాయతను పంచడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతగా భావించాలని ఆయన సూచించారు.
సమాజానికి మనం ఇచ్చే గొప్ప బహుమతి డబ్బు కాదు, మన సమయం, ఆప్యాయత, మానవత్వం. మనం చేసే చిన్న సేవ మరొకరికి స్ఫూర్తిగా మారాలి అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా వృద్ధుల పట్ల గౌరవం, సేవాభావం, మానవతా విలువలను చాటారు.












