వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా మెట్టుపల్లి గ్రామంలో శ్రమదానం నిర్వహించారు. సర్పంచ్ తిరుపతి రెడ్డి, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎం, పంచాయతీ కార్యదర్శి, యువత పాల్గొన్నారు. గ్రామంలోని మురుగు కాలువలను శుభ్రం చేసి, రహదారుల పక్కన పేరుకుపోయిన చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు.
చిన్నకొండూరు : వికసిత్ భారత్లో భాగంగా మెట్టుపల్లి గ్రామంలో శ్రమదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. సర్పంచ్ తిరుపతి రెడ్డి, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎం, పంచాయతీ కార్యదర్శి, యువత, యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పరిసరాల పరిశుభ్రత
గ్రామంలోని మురుగు కాలువలను శుభ్రం చేయడంతో పాటు రహదారుల పక్కన పేరుకుపోయిన చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు. గ్రామాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దడంతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడమే లక్ష్యంగా ఈ శ్రమదానం నిర్వహించినట్లు గ్రామ పాలకవర్గం తెలిపింది.












