నిర్మల్ నిర్మల్‌జిల్లా కేంద్రంలో ఇటీవల జరిగిన బైక్ ప్రమాదంలో మరణించిన అమరవేణి నర్సాగౌడ్ కుమారుడు సిద్ధార్థ బహుజన్ గౌడ్ కుటుంబాన్ని పలువురు ప్రముఖులు, సంఘాల నాయకులు పరామర్శించారు. మృతుడి కుటుంబానికి వారు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
నిర్మల్ నిర్మల్‌జిల్లా కేంద్రంలోని వెంకటాపూర్ కాలనీలో ఇటీవల జరిగిన బైక్ ప్రమాదంలో సిద్ధార్థ బహుజన్ గౌడ్ అనే యువకుడు మరణించిన విషయం తెలిసిందే. అమరవేణి నర్సాగౌడ్ కుమారుడైన సిద్ధార్థ గౌడ్ మృతి పట్ల పలువురు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఈ దురదృష్టకర సంఘటన నేపథ్యంలో, వివిధ ప్రజా సంఘాల నాయకులు, బీసీ సంక్షేమ సంఘం నాయకులు, మాజీ మావోయిస్టు నేతలు, గౌడ సంఘం రాష్ట్ర నాయకులు మృతుడి కుటుంబాన్ని పరామర్శించి, వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఈ పరామర్శ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్, మాజీ మావోయిస్టు నేత గాజర్ల అశోక్ అలియాస్ (ఐతు), తెలంగాణ ప్రజా ఫ్రంట్ మాజీ రాష్ట్ర అధ్యక్షులు నలమాస కృష్ణ, నాయకులు సమ్మయ్య, సింగరేణి గని కార్మిక సంఘం నాయకులు సత్యం, అసంఘటిత కార్మిక సంఘాల సమాఖ్య రాష్ట్ర న్యాయ నాయకులు బంటు శ్రీనివాస్, రాజన్న, ఉదయ్, ఆదివాసి సంఘ నాయకులు గంట సత్యం, మాజీ ఎంపీపీ సారయ్య గౌడ్, వివిధ గౌడ సంఘాల రాష్ట్ర నాయకులు బండారి రమేష్ గౌడ్, సింగం సత్తయ్య గౌడ్, ఆనంతుల రమేష్ గౌడ్, కందుల శ్రీనివాస్ గౌడ్, గాజుల ముఖేష్ గౌడ్, ప్రకాష్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, కొండ్ర మనోహర్ గౌడ్, బీసీ సంఘం నేతలు అనుముల భాస్కర్, వివిధ ప్రజా సంఘాల నాయకులు నూతన్ కుమార్, శివ కుమార్, రాం లక్షణ్, తిరుపతి, కార్యకర్తలు, గౌడ సంఘాల నాయకులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు రావుల రాంనాథ్, కోరిపల్లి భూషణ్ రెడ్డి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.











