మిర్యాలగూడ పట్టణానికి చెందిన గుండా ఆంజనేయులు మృతి చెందగా, ఈ విషయం తెలిసిన వెంటనే వాసవి క్లబ్ ఐపిసి సభ్యులు మిట్టపల్లి విజయభాస్కర్ కుటుంబ సభ్యులను బుధవారం పరామర్శించారు. ఆంజనేయులు గారి కుమార్తె, వాసవి క్లబ్ డిస్టిక్ ఇంచార్జ్, కుటుంబ సభ్యులతో మాట్లాడి, నేత్రాలను డైమండ్ ఐ బ్యాంక్ ద్వారా అగర్వాల్ హాస్పిటల్ వారికి పంపించడం జరిగిందని తెలిపారు.
నేత్రదానం ప్రాముఖ్యత
నేత్రదానం మహాదానమని వాసవి క్లబ్ ఐపిసి సభ్యులు మాశెట్టి శ్రీనివాస్ (డైమండ్) అన్నారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ డిస్టిక్ ఇంచార్జ్ రేపాల వేదశ్రీ, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల జిల్లా అధ్యక్షులు మాలోతు బాలాజీ నాయక్, వాసవి క్లబ్ సభ్యులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.











