సేవా రంగంలో అగ్రగామిగా నిలుస్తున్న మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ మరోసారి తన సేవాభావాన్ని చాటుకుంది. పట్టణంలోని గుడుంచెరువు రాజీవ్‌నగర్‌లో నివసిస్తున్న చౌడం వెంకటరమణ అనే వృద్ధుడు అనారోగ్యంతో మృతి చెందగా, ఆయన అంత్యక్రియలు నిర్వహించేందుకు బంధువులు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో స్థానికులు ఫోన్ ద్వారా ఫౌండేషన్‌ను సంప్రదించారు.
సమాచారం అందిన వెంటనే స్పందించిన ఫౌండేషన్ చైర్మన్ మోరే లక్ష్మణరావు ఆధ్వర్యంలో ప్రతినిధులు ముందుకు వచ్చి, హిందూ స్మశానవాటికలో వృద్ధుడికి హిందూ సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు.
ఆపదలో ఉన్న వారికి అండగా నిలవడమే తమ సంస్థ లక్ష్యమని ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. ఈ సేవా కార్యక్రమానికి సహకరించిన ఫౌండేషన్ చైర్మన్ మోరే లక్ష్మణరావు, టౌన్ ప్రెసిడెంట్ అహమ్మద్ హుస్సేన్, నరేంద్ర, కిరణ్ కుమార్, అశోక్ కుమార్, సతీష్, సుబహన్ తదితరులకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.
శ్రీ అమ్మ శరణాలయంలోని వృద్ధులకు సహాయం చేయదలచిన దాతలు ఫౌండేషన్‌ను సంప్రదించాలని నిర్వాహకులు కోరారు. సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలనుకునే వారు 82972 53484, 9182244150 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు.











