నిర్మల్ జిల్లా మండలంలోని మాంజ్రీ గ్రామంలో జోగ్ దండే గోపాలరావు పటేల్ నూతన గృహప్రవేశ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే జీ. విఠల్ రెడ్డి హాజరై, నూతన గృహంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి నూతన గృహ యజమాని జోగ్ దండే గోపాలరావు పటేల్ ను, వారి కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా నూతన గృహ యజమానికి, కుటుంబ సభ్యులకు ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన గృహంలో వారు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
ఈ గృహప్రవేశ వేడుకలకు మార్కెట్ కమిటీ చైర్మన్ సిందే ఆనందరావు పటేల్, మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సాగర్ భాయ్ రాజన్న, పలువురు మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, ఝరి గ్రామానికి చెందిన ఆసం మాధవ్ వంటి ప్రముఖులు హాజరయ్యారు. వీరితో పాటు గ్రామస్తులు, నాయకులు, కార్యకర్తలు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని, గృహ యజమాని కుటుంబానికి శుభాకాంక్షలు తెలిపారు.












