చిన్నకోడూరు మండలం రామునిపట్ల గ్రామానికి చెందిన యాసరిని బాల లక్ష్మి మరణించిన విషయం తెలుసుకున్న వంగ రాజేశ్వర్ రెడ్డి, వారి నివాసానికి చేరుకుని మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ సందర్భంగా మృతురాలి కుటుంబానికి అండగా నిలుస్తూ రూ.5,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఆప్తులను కోల్పోయిన కుటుంబానికి కష్టకాలంలో తన వంతు సహాయం అందించి భరోసా కల్పించారు.












