నిర్మల్ పట్టణంలో గురువారం జరిగిన బ్యాంకర్ల కమిటీ సమావేశంలో వివిధ బ్యాంకింగ్ పథకాల అమలు తీరుపై సమీక్షించారు. మున్సిపల్ కమిషనర్ రవిబాబు, లీడ్ బ్యాంకు మేనేజర్ రామ్గోపాల్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది.
నిర్మల్, సెప్టెంబరు 24: పట్టణ స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం గురువారం నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ రవిబాబు, లీడ్ బ్యాంకు మేనేజర్ రామ్గోపాల్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బ్యాంకింగ్ సంబంధిత పథకాల అమలుపై సమీక్షించారు. మున్సిపల్ పరిధిలోని స్వయం సహాయక సంఘాల బ్యాంకు అనుసంధానం, వీధి వ్యాపారుల కోసం అమలు చేస్తున్న పీఎం స్వనిధి పథకం, ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం, ఇతర స్వయం ఉపాధి పథకాల పురోగతిపై చర్చించారు. అర్హులైన లబ్ధిదారులకు పథకాల ప్రయోజనాలు త్వరితగతిన అందేలా బ్యాంకర్లు సహకరించాలని మున్సిపల్ కమిషనర్ రవిబాబు కోరారు. ఈ సమావేశంలో పట్టణ స్థాయి సమన్వయకర్త సావిత్రి, బ్యాంకర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.












