ప్రజలకు ఊరటనిస్తూ, మొబైల్ రీఛార్జ్ ధరలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. టెలికాం కంపెనీలు చెల్లించే లైసెన్స్ ఫీజు, స్పెక్ట్రమ్ ఛార్జీలపై పన్నును తగ్గించే అవకాశం ఉంది. దీనితో మొబైల్ రీఛార్జ్ ప్లాన్ల ధరలు 10-15 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ప్రజలకు ఊరటనిస్తూ, మొబైల్ రీఛార్జ్ ధరలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. టెలికాం కంపెనీలు చెల్లించే లైసెన్స్ ఫీజు, స్పెక్ట్రమ్ ఛార్జీలపై పన్నును 8 శాతం నుంచి 3-4 శాతానికి తగ్గించే అవకాశం ఉంది. గ్రామీణ ఇంటర్నెట్ నిధికి వెళ్లే 5 శాతం పన్ను వసూలును తాత్కాలికంగా నిలిపివేయాలని కూడా ప్రభుత్వం యోచిస్తోంది. ఈ పన్ను తగ్గింపుతో మొబైల్ రీఛార్జ్ ప్లాన్ల ధరలు 10-15 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.












