నల్గొండ, 11 September
రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు నిరసనగా శుక్రవారం మిర్యాలగూడ పరిసర ప్రాంతాలలో రైస్ మిల్లులు సంపూర్ణంగా బంద్ అయ్యాయి. కస్టమ్ మిల్లింగ్ రైస్ () కు బదులుగా బాయిల్డ్ రైస్ సరఫరాకు అవసరమైన రేక్ లను ఏర్పాటు చేయాలని మిల్లర్లు డిమాండ్ చేస్తున్నారు.
రైస్ మిల్లుల బంద్ విజయవంతం.. కలెక్టరేట్ వద్ద రైస్ మిల్లర్స్ భారీ ధర్నా : మిర్యాలగూడ (మనోరంజని తెలుగు టైమ్స్) రాష్ట్ర ప్రభుత్వం రైస్ మిల్లుల విషయంలో అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా శుక్రవారం నుంచి రైస్ మిల్లులు బంద్ పాటించి, నిరసన వ్యక్తం చేయాలని రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసి యేషన్ పిలుపుమేరకు జిల్లా మిర్యాలగూడ పట్టణ పరిసర ప్రాంతాలలో రైస్ మిల్లుల బంద్ సంపూర్ణంగా విజయవంతం అయింది. కష్టం మిల్లింగ్ రైస్ (రారైస్ కు) బదులు, బాయిల్డ్ రైస్ సరఫరాకు కావాల్సిన రేక్ లను ఏర్పాటు చేయాలని తదితర ప్రధాన డిమాండ్లతో మిల్లర్స్ యజమానులు మిల్లులు బంద్ పాటించి సమ్మెకు దిగారు. జిల్లా కలెక్టరేట్ వద్ద రైస్ మిల్లర్స్ యజమానులు భారీ ధర్నా చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కర్నాటి రమేష్, మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గౌరు శ్రీనివాస్,కార్యదర్శి వెంకటరమణా చౌదరి (బాబి) ఉపాధ్యక్షులు గోళ్ళ రామశేఖర్, కార్యదర్శి పోలిశెట్టి ధనుంజయ, కోశాధికారి గందె రాము, తో పాటు కర్నాటిలక్ష్మీనారాయణ, గుడిపాటి శ్రీనివాస్, పూనాటి తిరుపతిరావు, అల్లాని రమేష్, జై.వి. రమణ,శివ,పవన్, గుంటి గోపి, తదితరులు పాల్గొన్నారు.












