మాల్దకల్, 11 September
రైతు రిజిస్ట్రేషన్ చేసుకోవడం, వరి పంటలో పురుగులు, తెగుళ్ల నివారణపై రైతులకు అవగాహన కల్పించారు. మిర్యాలగూడ పట్టణంలోని రైతువే మండల వ్యవసాయాధికారి రుషేంద్రమని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ పథకాలు, రుణాలు, బీమా వంటి సేవలు పొందడానికి రైతు రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని అధికారులు తెలిపారు.
రైతు రిజిస్ట్రేషన్, పంటల మార్పిడిపై రైతులకు అవగాహన : మండల వ్యవసాయ అధికారి రుషేంద్రమని మిర్యాలగూడ (మనోరంజని తెలుగు టైమ్స్) రైతులకు రైతు రిజిస్ట్రేషన్, మార్పిడి వరి పంటలో పురుగులు, తెగుళ్ల నివారణపై శుక్రవారం మిర్యాలగూడ పట్టణంలోని రైతువే మండల వ్యవసాధికారిరుషేంద్రమని అవగాహన కల్పించారు.ఈ సంద ర్భంగా వ్యవసాయఅధి కారులుమాట్లాడుతూ రైతులందరూతప్పని సరిగా ఫార్మర్ రిజిస్ట్రేష న్,చేసుకోవాలని సూచించారు. రైతు రిజిస్ట్రేషన్ ద్వారా ప్రభుత్వ పథకాలు, పంటల కొనుగోలు, పంటరుణాలు, బీమా ఇతర వ్యవసాయ సేవలు పొందేందుకు ప్రయోజనం ఉంటుందని తెలిపారు.ప్రస్తుతం వాతావరణపరిస్థితులు, నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని రైతులు ఒకే పంటపైఆధారపడకుండా పంటల మార్పిడి, పంటల వైవిధ్యీకరణను ప్రోత్సహించుకోవాలని సూచించారు.వరి స్థానంలో కంది, పెసర, మినుము, జొన్న, సజ్జ, వేరుశనగ, పొద్దుతిరు గుడు వంటి తక్కువ నీటి అవసరమయ్యే పంటలను సాగు చేయడం ద్వారా నీటి పొదుపుతో పాటు నేల ఆరోగ్యం మెరుగుపడి, సాగు నష్టాల ప్రమాదం తగ్గుతుందనివివరించారు.వరి పంటలో పురుగులు, తెగుళ్లను ప్రారంభ దశలోనే గుర్తించి, వ్యవసాయ శాఖ సూచించిన సమగ్ర సస్యరక్షణ పద్ధతులను పాటించాలని రైతులకు సూచించారు.అవసరం లేని పురుగుమందుల వినియోగాన్నినివారించి,శాస్త్రీయ పద్ధతుల్లో పంటల యాజమాన్యం చేప ట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిటియం గిరి, ఏఈఓ మలావత్ రమేష్ తదితరులుపాల్గొన్నారు.












