వరి పంట పొలాలను తాజా మాజీ జడ్పీటీసీ ఓసా రాజేశ్వర్ పరిశీలించారు. సరస్వతి కెనాల్ ద్వారా విడుదల చేసిన నీటిని రైతులు సద్వినియోగం చేసుకొని పంటలను సంరక్షించుకోవాలని ఆయన సూచించారు.
వరి పంట పొలాలను తాజా మాజీ జడ్పీటీసీ ఓసా రాజేశ్వర్ పరిశీలించారు. సరస్వతి కెనాల్ ద్వారా విడుదల చేసిన నీటిని రైతులు సద్వినియోగం చేసుకొని పంటలను సంరక్షించుకోవాలని ఆయన సూచించారు. రైతులు దేశానికి వెన్నెముక అని మాజీ జడ్పీటీసీ కొనియాడారు. వారాబంది పద్ధతిలో సరస్వతి కాలువ నుండి నీరు వస్తుందని, కావున రైతులందరూ దీనిని సద్వినియోగం చేసుకొని పంటలు పండించుకోవాలని కోరారు.












