సారంగాపూర్ మండలం కౌట్ల (బి) గ్రామంలోని పరపతి సహకార సంఘం (మ్యాక్స్) నూతన పాలకవర్గం శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఈ ఎన్నికల్లో వెంకట్ రెడ్డి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. రైతులకు సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన తెలిపారు.
సారంగాపూర్ మండలానికి చెందిన కౌట్ల (బి) గ్రామంలో రైతులు ఏర్పాటు చేసుకున్న పరపతి సహకార సంఘం (మ్యాక్స్) నూతన పాలకవర్గాన్ని శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంస్థ నూతన అధ్యక్షుడిగా వెంకట్ రెడ్డి, ఉపాధ్యక్షుడిగా సాధు రామ్ రెడ్డి, కార్యదర్శిగా అట్లా శ్రీకాంత్ రెడ్డి, కోశాధికారిగా పాతయిరా సత్యపాల్ రెడ్డి ఎన్నికయ్యారు. అలాగే బోర్డు డైరెక్టర్లుగా లక్కడి రాజమోహన్ రెడ్డి, అట్ల సత్యపాల్ రెడ్డి, సోమిరెడ్డి నారాయణరెడ్డి, గన్ను సాయందర్ రెడ్డి, వంగ రాంరెడ్డి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులు, వివిధ కంపెనీల ప్రతినిధులు నూతన పాలకవర్గాన్ని శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ ఎన్నికలు ఏకగ్రీవం కావడం పట్ల సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం నూతన అధ్యక్షుడు వంగ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ, పరపతి సంఘం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. సంఘం ద్వారా రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.












