ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలోని ఎస్ఎన్సీయూ వార్డులో సోమవారం అర్ధరాత్రి షార్ట్‌సర్క్యూట్ సంభవించింది. ఏసీలో విద్యుత్ లోపం కారణంగా పొగలు కమ్ముకోవడంతో కలకలం రేగింది. ఈ ఘటనలో ఐదు రోజుల శిశువు మృతి చెందగా, అస్వస్థతకు గురైన 27 మందిని వేరే ఆస్పత్రికి తరలించారు.
ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలోని ఎస్ఎన్సీయూ () వార్డులో సోమవారం అర్ధరాత్రి షార్ట్‌సర్క్యూట్ చోటుచేసుకుంది. వార్డులోని ఏసీలో విద్యుత్ లోపం తలెత్తడంతో ఒక్కసారిగా పొగలు కమ్ముకున్నాయి. దీంతో తల్లిదండ్రులు, ఆస్పత్రి సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రమాదాన్ని గుర్తించిన సిబ్బంది వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేసి, వార్డులో ఉన్న శిశువులను సురక్షితంగా పక్క వార్డుకు తరలించారు. ఘటనపై సమాచారం వెంటనే జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆస్పత్రికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. ఈ ఘటనలో అస్వస్థతకు గురైన 27 మంది శిశువులను మెరుగైన వైద్యం కోసం సురక్ష ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అయితే, ఇచ్చోడకు చెందిన ఐదు రోజుల శిశువు మృతి చెందింది. ఈ వార్త తీవ్ర విషాదాన్ని నింపింది. ఘటనపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. షార్ట్‌సర్క్యూట్‌కు దారితీసిన కారణాలపై విచారణ చేపట్టినట్లు తెలిపారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు.












