డబ్లిన్, ఐర్లాండ్ (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 22
యూజర్ల లొకేషన్ డేటా నిర్వహణలో జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ (జీడీపీఆర్) నిబంధనలు ఉల్లంఘించినందుకు టెక్ దిగ్గజం గూగుల్‌కు ఐర్లాండ్ డేటా రక్షణ కమిషన్ (డీపీసీ) భారీ జరిమానా విధించింది. సుమారు 403 మిలియన్ యూరోలకు సమానమైన రూ.3,700 కోట్ల జరిమానా విధించినట్లు సమాచారం.

డేటా నిర్వహణలో పారదర్శకత లోపం
2020 నుంచి 2024 వరకు సేకరించిన లొకేషన్ డేటా విషయంలో పారదర్శకత, చట్టబద్ధత పాటించలేదని డీపీసీ దర్యాప్తులో తేలినట్లు పేర్కొంది. వినియోగదారులకు డేటా వినియోగం, నిర్వహణకు సంబంధించిన సమాచారాన్ని స్పష్టంగా తెలియజేయలేదని తెలిపింది.
ఆరు నెలల్లోగా మార్పులు చేయాలని ఆదేశం
యూరోపియన్ వినియోగదారుల సంస్థలు 2020లో చేసిన ఫిర్యాదుల ఆధారంగా ఈ కేసుపై దర్యాప్తు ప్రారంభమైంది. ఆరు నెలల్లోగా సంబంధిత విధానాలను మార్చుకోవాలని గూగుల్‌ను డీపీసీ ఆదేశించింది.