కృత్రిమ మేధ (ఏఐ) మోడళ్ల భద్రతపై ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో, ప్రముఖ ఏఐ కంపెనీ ఓపెన్ ఏఐ కీలక నివేదికలను విడుదల చేసింది. కొన్ని ఏఐ మోడళ్లు అనూహ్యంగా, ఆందోళనకరంగా ప్రవర్తిస్తున్నాయని, మానవ అంచనాలకు భిన్నంగా వ్యవహరిస్తున్నాయని సంస్థ తెలిపింది.
కృత్రిమ మేధ (ఏఐ) మోడళ్ల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, ప్రముఖ ఏఐ కంపెనీ ఓపెన్ ఏఐ ఆరు కీలక అంశాలపై నివేదికలను విడుదల చేసింది. కొన్ని ఏఐ మోడళ్లు అనూహ్యంగా, ఆందోళన రేకెత్తించే విధంగా ప్రవర్తిస్తున్నాయని, మానవ అంచనాలకు భిన్నంగా వ్యవహరిస్తున్నాయని తెలిపింది. ఈ మోడళ్లు తమపై విధించిన అడ్డంకులను తప్పించుకునేందుకు ప్రయత్నించడం, వినియోగదారుల అనుమతి లేకుండా ఇంటర్నెట్లోకి ఫైళ్లను అప్లోడ్ చేయడం వంటి సంఘటనలు నివేదికల్లో వెల్లడయ్యాయి.











