నిజామాబాద్, 7 September
సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా, మాణిక్ భవన్ ఉపాధ్యాయులు మాణిక్యం గారిని మే ఐ హెల్ప్ యు జిల్లా అధ్యక్షులు ధర్మేంద్ర మాల్వేకర్ సన్మానించారు. విద్యార్థుల విధేయతకు ఇది నిదర్శనమని మాణిక్యం అన్నారు.
సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకుని, మాణిక్ భవన్ ఉపాధ్యాయులు మాణిక్యం గారిని మే ఐ హెల్ప్ యు జిల్లా అధ్యక్షులు ధర్మేంద్ర మాల్వేకర్ సన్మానించారు. ఈ సందర్భంగా మాణిక్ భవన్ ఉపాధ్యాయులు మాణిక్యం మాట్లాడుతూ, విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఎదిగి మమ్మల్ని సన్మానించడం వారి విధేయతకు దర్పణం పడుతుంది. ప్రతి ఉపాధ్యాయులకు విద్యార్థులు కుటుంబ సభ్యులతో సమానం. ఈ జగతిలో ఉపాధ్యాయులను గుర్తించినప్పుడే విద్యార్థుల భవితవ్యం బాగుంటుంది. వారు మమ్మల్ని ఆదరించి సన్మానం చేయడం ఎంతో ఆనందదాయకం అని, ధర్మేంద్రకు కృతజ్ఞతలు తెలిపారు.












