(ఎన్హెచ్ఆర్సీ) (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 07
సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. జాతీయ మానవ హక్కుల సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గురువుల పాత్రను, ప్రాముఖ్యతను కొనియాడారు.
సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకుని జాతీయ మానవ హక్కుల సంస్థ జిల్లా అధ్యక్షులు ధర్మేంద్ర ఆధ్వర్యంలో శివాజీనగర్‌లోని శ్రీ రామకృష్ణ విద్యాలయంలో ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ధర్మేంద్ర మాట్లాడుతూ.. గురువు లేని విద్య గుడ్డిది.. గురువును మించిన దైవం లేరు అనే సందేశాన్ని విద్యార్థులకు, సమాజానికి తెలియజేశారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. గురువులను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యతగా పేర్కొన్నారు.
కార్యక్రమంలో ఎన్హెచ్ఆర్సీ గాయని విజయలక్ష్మి ఉపాధ్యాయుల గొప్పతనాన్ని వివరిస్తూ ఆలపించిన పాట అందరినీ ఆకట్టుకుంది. అనంతరం శ్రీ రామకృష్ణ విద్యాలయ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ఎన్హెచ్ఆర్సీ నగర అధ్యక్షులు జె. లక్ష్మణ్, గాయని విజయలక్ష్మితో పాటు శ్రీ రామకృష్ణ విద్యాలయ ఉపాధ్యాయులు ఎస్.ఎన్. చారి, శశిరేఖ, శ్రీనివాస్, మధు, మాధురి, లక్ష్మీప్రియ తదితరులు పాల్గొన్నారు.












