ఫౌండేషన్ (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 07
సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లాలో మాణిక్ భవన్ ఉపాధ్యాయులు మాణిక్యంను మే ఐ హెల్ప్ యు జిల్లా అధ్యక్షులు ధర్మేంద్ర మాల్వేకర్ ఘనంగా సన్మానించారు. విద్యార్థులు తమ గురువులను గుర్తించి సన్మానించడం వారి విధేయతకు నిదర్శనమని ఈ సందర్భంగా మాణిక్యం అన్నారు.
గురువును సన్మానించడం గర్వకారణం సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా మాణిక్యం సన్మానం నిజామాబాద్ జిల్లా: సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకుని మాణిక్ భవన్ ఉపాధ్యాయులు మాణిక్యంను మే ఐ హెల్ప్ యు జిల్లా అధ్యక్షులు ధర్మేంద్ర మాల్వేకర్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాణిక్యం మాట్లాడుతూ.. విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగి తమ గురువులను గుర్తించి సన్మానించడం వారి విధేయతకు నిదర్శనమన్నారు. ప్రతి ఉపాధ్యాయుడికి విద్యార్థులు కుటుంబ సభ్యుల్లాంటివారని పేర్కొన్నారు. ఉపాధ్యాయులను గుర్తించి గౌరవించినప్పుడే విద్యార్థుల భవిష్యత్తు మరింత ఉన్నతంగా ఉంటుందని అన్నారు. తనను గుర్తించి సన్మానించడం ఎంతో ఆనందంగా ఉందని, ఇందుకు మే ఐ హెల్ప్ యు జిల్లా అధ్యక్షులు ధర్మేంద్ర మాల్వేకర్కు కృతజ్ఞతలు తెలిపారు.








