ఖానాపూర్, 2026-09-05
ఖాాపూరజలలాలోఉతనిగ్వ పాఠశాలలోపెషదరోహదంసందరభంగాఉపాధయాయులులలబయాడజలుధరంచరసతెలపారు.సీపీఎసరదదుచేసపాతపెషధాం(ఓపీఎస)అమలుచేయాల,డీఏబకాయలుచెలలంచాల,పీఆరసీసతరమేఅమలుచేయాలారుడమాండచేశారు.
ఖానాపూర్, సెప్టెంబర్ 5, 2026: మనోరంజని తెలుగు టైమ్స్: నిఘ్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం, సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా ఉపాధ్యాయ బృందం నల్ల బ్యాడ్జి ధరించి నిరసన తెలిపారు. సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) అమలు చేయాలని, ఆరు నెలల డీఏ బకాయిలు చెల్లించాలని, పీఆర్సీని సత్వరమే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఈ నెల 10వ తేదీన టీజీఈఏసీ తలపెట్టిన రాష్ట్రవ్యాప్త మహా ధర్నాను విజయవంతం చేయాలని ఎస్టీయూ టీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ నాంపల్లి నాగభూషణ్, ఎస్టీయూ టీఎస్ రాష్ట్ర బాధ్యులు పల్సికర్ శ్రీనివాస్ కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు నాంపల్లి నాగభూషణం, పి.శ్రీనివాస్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.












