నిజామాబాద్, 7 September
కులాస్పూర్ జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాలలో భారత మాజీ రాష్ట్రపతి, తత్వవేత్త సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పాఠశాల హెడ్మాస్టర్ సింగం వనిత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులకు గురువుల ప్రాముఖ్యతను వివరించారు.
కులాస్పూర్ జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాలలో.. సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి పాఠశాల హెడ్మాస్టర్ సింగం వనిత ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరిగాయి.. ఈ సందర్భంగా వనిత మాట్లాడుతూ.. గురువును గౌరవించిన నాడే.. విద్యార్థుల పురోగతి ఉంటుందని.. గురువు లేని విద్య గుడ్డిది గురువే దైవంగా భావించే రోజులు రావాలని.. యువత చెడు దారి పోకుండా మంచి దారిలో నడవాలని.. ఇంట్లో తల్లిదండ్రులతోపాటు పాఠశాలలో గురువును గౌరవించిన నాడే.. యువత అభ్యున్నతి ఉంటుందని.. వనిత తెలిపారు












