దీపావళి కానుకల పేరుతో జరుగుతున్న సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. పేటీఎం సంస్థ రూ.1,000 నగదు బహుమతి ఇస్తోందంటూ వాట్సాప్, సామాజిక మాధ్యమాల్లో నకిలీ సందేశాలు వైరల్ అవుతున్నాయని తెలిపారు.
పేటీఎం ఆఫర్ల పేరుతో వస్తున్న నకిలీ సందేశాల్లోని లింకులపై క్లిక్ చేయాలని మోసగాళ్లు ప్రలోభపెడుతున్నారని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు. ఈ ఆఫర్ నిజమని నమ్మించేలా నాకు రూ.1,000 వచ్చాయి.. మీరు కూడా ప్రయత్నించండి అంటూ తప్పుడు సందేశాలను ప్రచారం చేస్తున్నారని తెలిపారు.
అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయవద్దని, బ్యాంకు ఖాతా వివరాలు, ఏటీఎం పిన్, ఓటీపీ, యూపీఐ పిన్, పాస్‌వర్డ్‌లను ఎవరికీ వెల్లడించవద్దని ప్రజలకు సూచించారు. ఇలాంటి సందేశాలను నిజానిజాలు తెలుసుకోకుండా ఇతరులకు పంపించవద్దని హెచ్చరించారు.
ఏదైనా ఆఫర్ల వివరాలను పేటీఎం అధికారిక వెబ్సైట్ లేదా గుర్తింపు పొందిన మార్గాల్లోనే ధ్రువీకరించుకోవాలని తెలిపారు. సైబర్ మోసానికి గురైనవారు వెంటనే 1930 నంబర్‌కు ఫోన్ చేయాలని లేదా .. వెబ్సైట్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు.











