హైదరాబాద్లో ఈ నెల 17, 18, 19 తేదీల్లో జరగనున్న 5వ తెలంగాణ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్2026 కోసం బాసర జోన్ క్రికెట్ జట్లు సన్నద్ధమవుతున్నాయి. నిర్మల్ జిల్లా కొండాపూర్ సమీపంలోని లక్కీ స్పోర్ట్స్ క్రికెట్ అకాడమీలో జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్లను నిర్మల్ ఎస్పీ డా. జి. జానకి షర్మిల, ఈరోజు సందర్శించి క్రీడాకారులను ప్రోత్సహించారు.
తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 17, 18, 19 తేదీల్లో హైదరాబాద్లో 5వ తెలంగాణ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్2026 జరగనుంది. పోలీస్ సిబ్బందిలో శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం, క్రమశిక్షణ, జట్టు సమన్వయాన్ని పెంపొందించడంతో పాటు క్రీడా ప్రతిభను ప్రోత్సహించడం ఈ పోటీల ముఖ్య ఉద్దేశం. క్లస్టర్ పరిధిలో నిర్వహించే -20 క్రికెట్ పోటీల్లో 21 జట్లు పాల్గొననున్నాయి.
ఈ పోటీలకు బాసర జోన్ క్రికెట్ జట్లు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా నిర్మల్ జిల్లా కొండాపూర్ గ్రామ సమీపంలోని లక్కీ స్పోర్ట్స్ క్రికెట్ అకాడమీలో గత రెండు రోజులుగా ప్రాక్టీస్ మ్యాచ్లు నిర్వహిస్తున్నారు. ఈరోజు నిర్మల్ జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, అకాడమీని సందర్శించి ప్రాక్టీస్ మ్యాచ్లను వీక్షించారు. ఆటగాళ్ల బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ నైపుణ్యాలతో పాటు జట్టు సమన్వయాన్ని పరిశీలించి క్రీడాకారులను ప్రోత్సహించారు.
ప్రాక్టీస్ మ్యాచ్ల నిమిత్తం నిర్మల్ జిల్లాకు విచ్చేసిన జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, సైతం క్రికెట్ మ్యాచ్లో పాల్గొని పోలీస్ క్రీడాకారులతో కలిసి ఆడారు. అనంతరం నిర్మల్ జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, ను మర్యాదపూర్వకంగా కలిశారు.
కార్యక్రమంలో పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, , జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, , నిర్మల్ డీఎస్పీ పి. శ్రీనివాస్, నిర్మల్ జిల్లా డీవైఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
రాబోయే క్రీడా పోటీల్లో బాసర జోన్ క్రికెట్ జట్లు క్రీడా స్ఫూర్తి, క్రమశిక్షణ, జట్టు సమన్వయంతో ఉత్తమ ప్రతిభ కనబరిచి విజయాలు సాధించాలని ఎస్పీ ఆకాంక్షించారు.







