బేల్తరోడ గ్రామ పంచాయతీ పరిధిలో అనుమతులు లేకుండా చేపడుతున్న కమర్షియల్ మరియు ఇతర భవన నిర్మాణాలపై పంచాయతీ అధికారులు చర్యలు చేపట్టారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి రవికాంత్, సర్పంచ్ గోపా సుజాత సాయినాథ్ క్షేత్రస్థాయిలో పర్యటించి, నిర్మాణ పనులను నిలిపివేయించారు.
బేల్తరోడ గ్రామ పంచాయతీ పరిధిలో పంచాయతీ అనుమతులు లేకుండా చేపడుతున్న కమర్షియల్ మరియు ఇతర భవన నిర్మాణాలపై పంచాయతీ అధికారులు చర్యలు చేపట్టారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి రవికాంత్, సర్పంచ్ గోపా సుజాత సాయినాథ్ క్షేత్రస్థాయిలో పర్యటించి, అనుమతులు లేకుండా కొనసాగుతున్న నిర్మాణ పనులను నిలిపివేయించారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, గ్రామ పంచాయతీ నుంచి ముందస్తు అనుమతులు పొందిన తర్వాతనే భవన నిర్మాణ పనులు ప్రారంభించాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా, అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే పంచాయతీ చట్ట నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకోవడంతో పాటు, అక్రమ నిర్మాణాలను తొలగిస్తామని హెచ్చరించారు.
గ్రామ అభివృద్ధి, క్రమబద్ధమైన నిర్మాణాలు మరియు పంచాయతీ నిబంధనల అమలులో ప్రజలందరూ సహకరించాలని సర్పంచ్ గోపా సుజాత సాయినాథ్ కోరారు.












