రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ మంగళవారం నిర్మల్ కలెక్టరేట్‌కు విచ్చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి, స్వల్ప విరామం కోసం ఇక్కడకు చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.
ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి దామోదర రాజనరసింహ, వైద్యారోగ్యశాఖ కార్యదర్శి డాక్టర్ క్రిస్టియానా జె. చోంగ్తూ, స్వల్ప విరామం కోసం నిర్మల్ జిల్లా కలెక్టరేట్‌కు విచ్చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా వారికి పూలమొక్కలు అందించి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ ఛాంబర్లో మంత్రి దామోదర రాజనరసింహ అధికారులతో సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు. ముఖ్యంగా జిల్లాలో వైద్యారోగ్యశాఖకు సంబంధించిన అంశాలపై అధికారులతో సమీక్షించినట్లు మంత్రి తెలిపారు. మంత్రి స్వాగత కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి రాథోడ్ రమేష్, డీఎస్పీ శ్రీనివాస్, ఆర్డీఓ దేవీదాస్, వైద్యారోగ్యశాఖ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.












