ఐక్యవేదిక (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 08
నిర్మల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవనాన్ని మున్సిపల్ అధికారులు పశువుల కొట్టంగా మార్చారని, అధికారులు వెంటనే స్పందించి భవనాన్ని శుభ్రపరచాలని దళిత సంఘాల ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు అంబేద్కర్ భవన సమస్యలను తెలుసుకోవడానికి ఆ భవనాన్ని సందర్శించారు. అధికారులు భవనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
అంబేద్కర్ భవనమా పశువుల కొట్టమా అధికారులారా ఆలోచించండి అంబేద్కర్ భవనాన్ని శుభ్రపరచండి. అంబేద్కర్ భవన సమస్యలను తెలుసుకోవడానికి అంబేద్కర్ భవనాన్ని సందర్శించిన దళిత సంఘాల ఐక్యవేదిక జిల్లా నాయకులు. నిర్మల్ . చాకిరేవు నిర్మల్ అర్బన్ మండల్ రిపోర్టర్. కె. వెంకటస్వామి. జిల్లా దళిత సంఘాల ఐక్యవేదిక కుంటోల్ల వెంకటస్వామి, బత్తుల రంజిత్ మాట్లాడుతూ నిర్మల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవనంలో మున్సిపల్ అధికారులు నిర్మల్ పట్టణంలో రోడ్లమీద తిరిగే పశువులను పట్టుకొచ్చి అంబేద్కర్ భవనంలో ఉంచుతున్నారు అంబేద్కర్ భవనమును పశువుల కొట్టం లాగా తయారు చేశారు. మున్సిపాలిటీ కి సంబంధించిన ప్రతిరోజు చెత్తను తీసుకెళ్లే ట్రాక్టర్ వాహనాలను అంబేద్కర్ భవనం లోపల గల మైదానంలో పార్కింగ్ చేస్తున్నారు. జెసిబి ఇతర వాహనాలను పార్కింగ్ చేస్తున్నారు అంబేద్కర్ భవనం లోపల నిర్మల్ పట్టణంలో కోతులను పట్టే పని మనుషులు ఉండటానికి నివాసమును ఏర్పాటు చేశారు. బతుకమ్మ చీరల సంచులను రూములలో ఉంచుతూ గోదాం ల లాగా తయారు చేశారు. వికలాంగులకు సంబంధించిన ట్రై సైకిల్లను ఇతర సామాగ్రిని గోదంలాగే ఏర్పాటు చేశారు. అంబేద్కర్ భవనం యొక్క కిటికీలను తలుపులను పగులగొడుతున్నారు. అంబేద్కర్ భవనం లోపల మరుగుదొడ్లు మూత్రశాల లు అపరిశుభ్రంగా ఏర్పడ్డవి. అంబేద్కర్ భవనం చుట్టూ భవనం లోపల చెత్తా చెదరం పిచ్చి మొక్కలు పేరుకుపోయినవి. అంబేద్కర్ భవనం యొక్క వెనకాల స్థలాన్ని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కబ్జా చేశారు. ఈ యొక్క భవనము ఏర్పాటు కొరకు 30 సంవత్సరాలు పట్టింది. అంబేద్కర్ భవనం సాధించుకొనుటకు దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో గతంలో రిలే నిరాహార దీక్షలు, వివిధ మండలాల నుంచి పాదయాత్ర ల ద్వారా ప్రభుత్వాలకు తెలియజేస్తే 3 కోట్ల 50 లక్షల రూపాయలతో అంబేద్కర్ భవనాన్ని నిర్మించారు. 2022 సంవత్సరంలో ప్రారంభించారు. ఇట్టి భవనంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి ఇతర సభ సమావేశాలు జరిగేవి. అంబేద్కర్ భవనం లోపల ఇప్పటికీ కూర్చుండే కుర్చీలు ఏర్పాటు చేయలేరు. మైకు సౌండ్ సిస్టం రీ సౌండ్ వస్తున్నది అది కూడా రిపేరు చేయలేరు. మునిసిపల్ అధికారుల ఆధ్వర్యంలో జరుగుతున్న పర్యవేక్షణలో భాగంగా ఫంక్షన్లకు సమావేశాలకు ఉపయోగపడే భవనం అనుకుంటే పశువుల కొట్టంల పలు సమస్యలకు నిలయమైంది. తక్షణమే వారం రోజుల్లో ఈ యొక్క అంబేద్కర్ భవనము లో ఉన్నటువంటి పశువుల కొట్టాన్ని, బతుకమ్మ చీరల గోదామును, వికలాంగులకు సంబంధించిన ట్రై సైకిళ్లను ఇతర సామాగ్రిని మున్సిపల్ కు సంబంధించిన చెత్త వాహనాలను పార్కింగ్ చేయకుండా చూడాలని అంబేద్కర్ భవనాన్ని కబ్జాకు గురికాకుండా కాపాడాలని అంబేద్కర్ భవనము లోపల బయట సుందరీకరణ చేపట్టి పరిశుభ్రంగా చేసి దళిత సంఘాల ఐక్యవేదిక కమిటీకి అప్పగించాలని లేదా సాంఘిక సంక్షేమ శాఖ కు అప్పగించాలని తెలిపారు. లేనిపక్షంలో జిల్లా దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పలు ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అన్నారు. మరియు అంబేద్కర్ భవనం యొక్క సమస్యల పరిష్కారానికి మంగళవారం రోజు అధికారులకు వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తే వాళ్ళు అందుబాటులో లేరు కావున తేదీ.9.9.2026 బుధవారం రోజున ఉదయము 11 గంటలకు ప్రజా ప్రతినిధులైన నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి కి. మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పల గణేష్ చక్రవర్తి కి, జిల్లా ప్రభుత్వ అధికారులైన జిల్లా కలెక్టర్ కు, మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం ల ద్వారా ఈ సమస్యలను తెలియజేయడం జరుగుతుంది. కావున నిర్మల్ జిల్లాలోని దళిత సంఘాల ఐక్యవేదిక నాయకులు కార్యవర్గ సభ్యులు ప్రతి ఒక్కరు అత్యధిక సంఖ్యలో హాజరై కార్యక్రమలను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కుంటోల్ల వెంకటస్వామి, జిల్లా అధ్యక్షులు బత్తుల రంజిత్, భారతీయ బౌద్ధ మహాసభ జిల్లా అధ్యక్షులు కొంత మురళీధర్, మాల మహానాడు జిల్లా నాయకులు ఎలుమల రాజేశ్వర్, జైల లింగం, సాద ప్రవీణ్, ఆకుల రమేష్, తదితరులు పాల్గొన్నారు.











