నిర్మల్, 7 September
జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హల్ లో జరిగిన శాంతి సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి పాల్గొన్నారు. రాబోయే వినాయక చవితి పండుగ సందర్భంగా శాంతిభద్రతలకు పెద్దపీట వేస్తూ, మున్సిపల్ తరఫున అన్ని ఏర్పాట్లు చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు.
ఈ రోజు జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హల్ లో నిర్వహించిన పీస్ మీటింగ్లో మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శాంతి, భద్రతలకు ప్రాధాన్యతనిస్తూ, మున్సిపల్ తరఫున అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లు చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. రాబోయే వినాయక చవితి పండుగను ప్రజలందరూ శాంతియుత వాతావరణాన్ని కొనసాగిస్తూ, అధికారులకు సహకరించాలని కోరారు.












