నిర్మల్, 8 September
తెలంగాణ రాష్ట్రంలోని ఆశా వర్కర్లు తమ వేతనాన్ని నెలకు రూ.18 వేలకు పెంచాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు పలువురు వర్కర్లను అరెస్టు చేశారు.
ఆశా వర్కర్లకు నెలకు రూ.18 వేల స్థిర వేతనం నిర్ణయించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన ఆశా వర్కర్లు హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద భారీ ధర్నా నిర్వహించారు. వార్షిక సమావేశాల్లో ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించి, తక్షణమే రూ.18 వేల స్థిర వేతనం అమలు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ఆశా వర్కర్లు ధర్నాకు తరలివచ్చారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, ఆశా వర్కర్లకు ఆర్థిక భద్రత కల్పించాలని నాయకులు కోరారు.
ధర్నా సందర్భంగా పోలీసులు పలువురు ఆశా వర్కర్లను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలితో పాటు వివిధ జిల్లాల అధ్యక్షులు, వారి బృందాలు పాల్గొన్నాయి. జిల్లా నుంచి దేవిక, పార్వతి, చంద్రకళ, లావణ్య, వరలక్ష్మి, మమత, మార్తా, జహీదా తదితరులు పాల్గొని ధర్నాను విజయవంతం చేశారు.












