తీసుకోవాలి (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 07
నిర్మల్ జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు అందేలా చర్యలు తీసుకోవాలని తీసుకోవాలి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతిపై ఆయన సోమవారం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు అందేలా అధికారులు చర్యలు జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా నిర్మల్ జిల్లా మనో రంజని తెలుగు టైమ్స్ నిర్మల్ జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు అందించే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై అన్ని మండలాల ఎంపిడివోలతో సోమవారం సాయంత్రం కలెక్టరేట్ నుంచి విడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మండలాల వారీగా ఎన్ని దరఖాస్తులు వచ్చాయో అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. వచ్చిన ప్రతి దరఖాస్తును పరిశీలించి, నిజమైన లబ్ధిదారులను గుర్తించాలన్నారు. గుర్తించిన లబ్ధిదారుల వివరాలు ఎంపీడీవోల లాగిన్ ల నుంచి పై స్థాయికి వెంట వెంటనే పంపాలన్నారు. నిర్మాణంలో ఉన్న ఇండ్లు త్వరిత గతిని పూర్తయ్యేలా అధికారులు చొరవ చూపాలన్నారు. సాంకేతిక సమస్యలు ఏవైన ఉంటే తమ దృష్టికి తేవాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు ఎప్పటికప్పుడు పూర్తయ్యేలా చూడాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు, హౌసింగ్ పిడి శ్రీనివాస్ రెడ్డి, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


