కామారెడ్డి జిల్లాలో శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకుని వ తేదీ నుంచి వ తేదీ వరకు నెల రోజుల జిల్లా వ్యాప్తంగా 30, 30(ఎ) పోలీస్ యాక్ట్1861 అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఐపీఎస్ తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసు అధికారుల అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. ప్రజా ధనానికి నష్టం కలిగించేలా లేదా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడవద్దని ప్రజలను హెచ్చరించారు.
జిల్లాలో శాంతియుత వాతావరణం కొనసాగేందుకు ప్రజలు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు పోలీసు శాఖకు సహకరించాలని ఎస్పీ కోరారు.
అనుమతి లేకుండా నిషేధిత కార్యక్రమాలు నిర్వహించినా, చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడినా సంబంధిత వ్యక్తులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.











