మండలం ఝరీ బి గ్రామంలో పాత విద్యుత్ స్తంభాల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలని గ్రామ దుర్గామాత కమిటీ అధ్యక్షుడు దొంతుల రమేష్ విద్యుత్ శాఖ అధికారులను కోరారు. పాత స్తంభాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు.
మండలం ఝరీ బి గ్రామంలో పాత విద్యుత్ స్తంభాల స్థానంలో కొత్త విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయాలని గ్రామ దుర్గామాత కమిటీ అధ్యక్షుడు దొంతుల రమేష్, విద్యుత్ శాఖ అధికారులను కోరారు.
గ్రామంలో ఉన్న పాత విద్యుత్ స్తంభాల కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ముఖ్యంగా లారీలు రాకపోకలు సాగించే సమయంలో, గణేష్ నిమజ్జనం, దుర్గామాత నవరాత్రి ఉత్సవాలతో పాటు లోకశాహీర్ అన్నభావు సాటే జయంతి, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వంటి వివిధ కార్యక్రమాల సందర్భంగా విద్యుత్ సమస్యలు తలెత్తుతున్నాయని ఆయన తెలిపారు.
అలాగే, గ్రామంలో టెంట్లు ఏర్పాటు చేసిన సమయంలో కూడా పాత విద్యుత్ స్తంభాలు, వైర్ల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన తెలిపారు.
ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని విద్యుత్ అధికారులు గ్రామంలోని పాత స్తంభాలను పరిశీలించి, తొలగించి, కొత్త విద్యుత్ స్తంభాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టాలని దొంతుల రమేష్ కోరారు. గ్రామ ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని ఆయన విద్యుత్ శాఖ అధికారులను విజ్ఞప్తి చేశారు.









