జర్నలిస్టుల సమస్యల సాధనకై టి యు డబ్ల్యూ జె (ఐజేయు ) పిలుపుమేరకు అక్టోబర్ 2న ఆర్డీవో కార్యాలయం ఎదుట జరిగే జర్నలిస్టుల ధర్నా విజయవంతం చేయాలని నల్లగొండ జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కలిమెల నాగయ్య, టియు డబ్ల్యూజే జిల్లా ప్రచార కార్యదర్శి అస్లాం, మిర్యాలగూడ నియోజకవర్గ అధ్యక్షులుజూపల్లి బాలాజీ రావు కోరారు.
దేశవ్యాప్తంగాజర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఇటీవల కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో జరిగిన ఆల్ ఇండియా జర్నలిస్ట్ యూనియన్ జాతీయ కార్యవర్గ సమావేశంలో అక్టోబర్ 2న దేశవ్యాప్తంగా ధర్నా చేయాలనినిర్ణయించడం జరిగింది. ఐజేయు పిలుపుమేరకు టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున మిర్యాలగూడ ఆర్డీవో కార్యాలయం ఎదుట ఉదయం 10 గంటలకు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని జర్నలిస్టులకు పని భద్రత హార్దిక భద్రతను కల్పించాలని భౌతిక దాడుల నుంచి జర్నలిస్ట్ జర్నలిస్టులకు రక్షణ కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం జరుగుతుంది పత్రికల్లో పని చేస్తున్న వారికి 1958లో వేతన సవరణ చేయగా నేటి వరకు సవరణలు జరగలేదు. నిత్యావసర ధరల్లో మార్పులు ఇంధన రవాణాచార్జిల పెంపు, స్కూలు, హాస్పిటల్ ఖర్చులు పెరిగినందున న్యూ వేజ్ బోర్డు ఏర్పాటుచేసి వేతన సవరణలు చేపట్టాలని కోరడం జరుగుతుంది. అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల మంజూరు, క్యాష్ లెస్ ట్రీట్మెంట్ కోసం హెల్త్ కార్డుల మంజూరు, అక్రిడేషన్ కలిగిన జర్నలిస్టులకు రైల్వే పాస్ లు, మంజూరు చేయాలని కోరుతూ చేపడుతున్న ధర్నాకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుమిత్రులు హాజరై జయప్రదం చేయాలని కోరారు.












