50 ఏళ్లు నిండిన భవన నిర్మాణ కార్మికులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని, లేబర్ కార్డుల పంపిణీలో జాప్యం తగ్గించాలని టిబిఎన్ఆర్ఆర్కెఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు దూబాల శ్రీశైలం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో కార్మిక భవనం ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.
సిద్దిపేట జిల్లా కేంద్రంలో కార్మిక భవనం ఏర్పాటు చేయాలని, భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని టిబిఎన్ఆర్ఆర్కెఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు దూబాల శ్రీశైలం డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రంతో పాటు గంగాపూర్, పెద్దకోడూరు, సందులాపూర్, విట్టలాపూర్, రామంచ గ్రామాల్లో కార్మిక సంఘం జెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 50 సంవత్సరాలు నిండిన ప్రతి భవన నిర్మాణ కార్మికుడికి పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరారు. కార్మికులకు ఈఎస్ఐ ఆసుపత్రి సౌకర్యం అందుబాటులోకి తీసుకురావాలని, ప్రతి కార్మిక కుటుంబానికి ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా అండగా నిలవాలని అన్నారు.
ప్రభుత్వం చేపట్టిన లేబర్ కార్డుల పంపిణీలో జాప్యం జరుగుతోందని, కార్మిక శాఖ కార్యాలయంలో ప్రత్యేక చర్యలు తీసుకుని అర్హులైన ప్రతి కార్మికుడికి లేబర్ కార్డు అందేలా చూడాలని కోరారు. ప్రతి గ్రామంలో భవన నిర్మాణ కార్మిక భవనాల ఏర్పాటుకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని, సిద్దిపేట జిల్లా కేంద్రంలో కార్మిక భవనం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిద్దిపేట ఉపాధ్యక్షులు సాయన్న, శ్రీనివాస్ చారి, గౌరవాధ్యక్షుడు సద్దిరాములు, జక్కుల కిషన్, మల్యాల లక్ష్మీనారాయణ, మండల అధ్యక్షుడు చెరుకు నారాయణ, శంకర్, అంజయ్య తదితరులు మాట్లాడారు. ఆయా గ్రామాల అధ్యక్షులు అంబటి కనకయ్య, రేపాక రాజు, చంద్రయ్య, కుచ్చుల ఎల్లం, కొలుపుల రాజు, కానుగుల తిరుపతి, మండల కమిటీ సభ్యులు ఇట్టబోయిన రవి, జేరిపోతుల శంకర్, ఉడుత ఐలయ్య, జె. రమేష్, భూమయ్య తదితరులు పాల్గొన్నారు.












