పట్టణంలోని కే.ఆర్.కే కాలనీలో ఆదివారం ఇందిరమ్మ గృహ పథకం లబ్ధిదారులకు ప్రొసీడింగ్ లెటర్లను పంపిణీ చేశారు. 7వ వార్డు కౌన్సిలర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా లింగంపల్లి శశికాంత్, ముస్లె ఈశ్వర్, ఎల్చాల పోచన్న తదితరులు అర్హులైన లబ్ధిదారులకు ప్రొసీడింగ్ లెటర్లను అందజేశారు.
అనంతరం లబ్ధిదారులు మాట్లాడుతూ, ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న సొంత ఇంటి కలను సాకారం చేస్తున్నందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.












