హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైన చారిత్రక రోజును పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన దినోత్సవాన్ని మండలం ఓని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గురువారం ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ జాదవ్ జగదీష్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ప్రజాస్వామ్య విలువలు, ప్రజా పాలన ప్రాధాన్యతను గుర్తుచేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు సమష్టిగా కృషి చేయాలని సర్పంచ్ జగదీష్ పేర్కొన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పురుషోత్తం, వార్డు సభ్యులు జి. యోగేష్, అనిత, వీణ, స్నేహ, పంచాయతీ కార్యదర్శి మధుకర్ రావు, ఫీల్డ్ అసిస్టెంట్ సూర్యవంశీ రాములు, అంగన్వాడీ టీచర్లు భారత్ బాయి, అనుష, ఆశా వర్కర్లు, ప్రధానోపాధ్యాయుడు శ్రీధర్ సార్, వీడీసీ సభ్యులు గంగాధర్ పటేల్, కదం సంజీవ్, యువకులు, కూలీలు, గ్రామస్తులు పాల్గొన్నారు.












