మిర్యాలగూడెం డివిజన్ గ్రామ పాలన అధికారుల సమావేశం టిఎన్జిఓ భవనంలో బి. రూపురావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో డివిజన్ పరిధిలోని మండలాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొని పలు అంశాలపై చర్చించారు. గ్రామ పాలన అధికారులకు పదోన్నతులు, సర్వే శిక్షణ కల్పించాలని వారు కోరారు.
గ్రామ పాలన అధికారులకు పదోన్నతుల విషయంలో గతంలో ఉన్న జీవోలను సవరించి, అర్హత కలిగిన జిపిఓలందరికీ పదోన్నతులు కల్పించాలని, అలాగే అర్హత కలిగిన జిపిఓలందరికీ సర్వే శిక్షణ ఇప్పించాలని వారు కోరారు.
పదోన్నతులు, బదిలీలపై తీర్మానం
వీఆర్వో, జూనియర్ సహాయకులు, గ్రామ పాలన అధికారులుగా 6, 12, 18 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకున్న జిపిఓలకు స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని సమావేశంలో తీర్మానించారు. నియోజకవర్గం వెలుపల జిపిఓల నియామకం జరిగినందున, జిపిఓలు ఎదుర్కొంటున్న సమస్యలను జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి, బదిలీలు జరిగేలా చొరవ తీసుకోవాలని కూడా కోరారు.
ఈ సమావేశంలో డివిజన్ ప్రధాన కార్యదర్శి కోడిరెక్క సంపత్, జిల్లా కన్వీనర్ సయ్యద్ నజీర్, రంగరాజు శ్రీనివాసులు, పగిడిపాటి నవీన్, మహిళా అధ్యక్షరాలు భద్రంరాజు నీరజ, డివిజన్ మండలాల అధ్యక్ష కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.












