తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో గురువారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో ఎస్. రమణారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు.
పాల్గొన్న ప్రముఖులు
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, కార్యాలయ డీటీ చాంద్ పాషా, ఆర్ఐ రామకృష్ణ, ఎస్ఏ అబ్బాస్, జమాల్, సీసీ శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ నాయకులు సాధినేని శ్రీనివాసరావు, బంటు సైదులు, రేపాల పురుషోత్తంరెడ్డి, ఎడ్ల రమేష్, బంటుగిరి, సీనియర్ జర్నలిస్టులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.












