గుడిసెలేని బాసరను చూడాలన్నదే తన కల అని, ఆ కలను సాకారం చేసే బాధ్యత తనదేనని సర్పంచ్ వెంకటేష్ గౌడ్ అన్నారు. సొంతింటి కలను కాంగ్రెస్ ప్రభుత్వం సాకారం చేస్తుందని, విడతల వారీగా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామని తెలిపారు. బాసర గ్రామపంచాయతీ భవనంలో బుధవారం ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు.
గుడిసెలేని బాసరను చూడాలన్నదే తన కల అని, ఆ కలను సాకారం చేసే బాధ్యత తనదేనని సర్పంచ్ వెంకటేష్ గౌడ్ అన్నారు. సొంతింటి కలను కాంగ్రెస్ ప్రభుత్వం సాకారం చేస్తుందని, విడతల వారీగా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామని తెలిపారు.
బాసర గ్రామపంచాయతీ భవనంలో బుధవారం ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు సర్పంచ్ వెంకటేష్ గౌడ్, స్థానిక నాయకులతో కలిసి అందజేశారు.
లబ్ధిదారులకు భరోసా
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులైన లబ్ధిదారులు ఎలాంటి ఆందోళన చెందవద్దని అన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం విడతల వారీగా అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఈవో ప్రసాద్ గౌడ్, ఉపసర్పంచ్ సయ్యద్ అలీ, వార్డు సభ్యులు కృష్ణ, ఫసి, అన్నెల లక్ష్మణ్, ఏజాస్, పరమేశ్, అనిల్, నానం సాయిలు, ఫారుక్, అశోక్, నాయకులు షానవాజ్ తదితరులు పాల్గొన్నారు.












