వరుసగా పేలవ ప్రదర్శనల కారణంగా ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ మార్నస్ లబుషేన్‌కు న్యూజిలాండ్‌తో జరగనున్న టెస్ట్ సిరీస్ నుంచి జట్టు యాజమాన్యం షాక్ ఇచ్చింది, అతడిని ఈ సిరీస్‌కు ఎంపిక చేయకూడదని సెలెక్టర్లు నిర్ణయించారు.
లబుషేన్ గత కొంతకాలంగా టెస్ట్ క్రికెట్లో ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. 2023 యాషెస్ సిరీస్ తర్వాత ఇప్పటివరకు టెస్ట్ సెంచరీ చేయలేదు. వరుసగా 49 ఇన్నింగ్స్‌లలో సెంచరీ సాధించలేకపోయాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో ఆరు ఇన్నింగ్స్‌లలో కలిపి కేవలం 131 పరుగులు మాత్రమే చేశాడు. ఇటీవల 10 టెస్టుల్లో అతని బ్యాటింగ్ సగటు 23.66గా ఉంది. ఐసీసీ టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఒకప్పుడు నంబర్ వన్ స్థానంలో ఉన్న అతను ప్రస్తుతం 40వ స్థానానికి పడిపోయాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ (0, 4) విఫలమయ్యాడు. ఈ సిరీస్‌ను ఆస్ట్రేలియా 1-2తో కోల్పోయింది.
లబుషేన్‌ను న్యూజిలాండ్‌తో జరిగే మొత్తం టెస్ట్ సిరీస్‌కు ఎంపిక చేయబోమని బెయిలీ స్పష్టం చేశారు. అయితే అతడిని శాశ్వతంగా జట్టుకు దూరం చేయలేదని తెలిపారు. గతంలో లబుషేన్ అద్భుతమైన ప్రదర్శనలు చేశాడని, తిరిగి ఫామ్‌లోకి వస్తే జట్టులోకి వచ్చే అవకాశం ఉందని చెప్పారు.
లబుషేన్ తిరిగి క్వీన్స్లాండ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తూ షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో ఆడనున్నాడు. అక్కడ పరుగులు సాధించి తన ఫామ్‌ను నిరూపించుకోవాల్సి ఉంటుంది. 2027లో ఆస్ట్రేలియా జట్టు భారత్, ఇంగ్లండ్ పర్యటనలు చేయనుంది. ఈ పర్యటనలకు ముందు లబుషేన్ తిరిగి ఫామ్‌లోకి వస్తే జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉందని సెలక్షన్ చైర్మన్ వెల్లడించారు.











