సారంగాపూర్, 10 September
నిర్మల్ జిల్లా మండలం చించోలి (బి) గ్రామంలోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ బాయ్స్1 విద్యార్థులు రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపికయ్యారు. షేక్ ఫర్హాన్, మహమ్మద్ అహ్మద్ ఖాన్ సబ్‌జూనియర్ విభాగంలో రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యారు. వీరు బెల్లంపల్లిలో జరిగే పోటీల్లో పాల్గొంటారు.
*సాఫ్ట్‌బాల్ రాష్ట్రస్థాయి పోటీలకు చించోలి పాఠశాల విద్యార్థులు ఎంపిక* నిర్మల్ జిల్లా మండలం చించోలి (బి) గ్రామంలోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ బాయ్స్–1 విద్యార్థులు క్రీడారంగంలో సత్తా చాటారు. పాఠశాలకు చెందిన షేక్ ఫర్హాన్, మహమ్మద్ అహ్మద్ ఖాన్ సబ్‌జూనియర్ విభాగంలో రాష్ట్రస్థాయి జట్టుకు ఎంపికయ్యారు. వీరు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీల్లో పాల్గొననున్నారు. నిర్మల్ జిల్లాలో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీలలో ప్రతిభ కబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఇద్దరు విద్యార్థులు ఎంపిక కావడం పాఠశాలకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు ఎంతో గర్వకారణంగా నిలిచింది. విద్యార్థుల ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహించిన ఫిజికల్ డైరెక్టర్ బి. సురేశ్, పీఈటీ ఎం.డి. అజర్ హుస్సేన్ లను అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ వి. మహేశ్,కోఆర్డినేటర్ షాకీర్ అహ్మద్ విద్యార్థులను అభినందించారు.












