ఉప సర్పంచ్ ల చెక్ పవర్ రద్దు చేయాలి : జిల్లా కన్వీనర్ బెజ్జం సాయి 👉 జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ కు వినతి
మిర్యాలగూడ సెప్టెంబర్ 9 (మనోరంజని తెలుగు టైమ్స్)
గ్రామపంచాయతీ ఉప సర్పంచ్లకు చెక్ పవర్ రద్దు చేయాలని కోరుతూ సర్పంచ్ ల సంఘం నల్గొండ జిల్లా కన్వీనర్ బెజ్జం సాయి ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ వినతి పత్రం సర్పంచులతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా బెజ్జం సాయి మాట్లాడుతూ గ్రామపంచాయతీల సజావు నిర్వాహణ, గ్రామాల అభివృద్ధి కోసం ఉపసర్పంచ్ లకు కల్పించిన జాయింట్ చెక్ పవర్ ను రద్దుచేసి ప్రజలచే ఎన్నుకోబడిన సర్పంచ్ ఒక్కరికే చెక్ పవర్ అవకాశం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో గ్రామ సర్పంచులకు విధులు, నిధులు ఉండేవి సర్పంచ్ కు ఒక్కరికే చెక్ పవర్ ఉండటంతో పాటు ప్రభుత్వం అందించిన స్టాంపు డ్యూటీ మైనింగ్, సిజనరైజ్ ఫీజుల ద్వారా వచ్చే నిధులు నేరుగా గ్రామపంచాయతీ ఖాతాల్లోజమ అయ్యాయని, దీంతో గ్రామపంచాయతీ ఖాతాలో నేరుగా జమాయిన విధులతో సర్పంచులు గ్రామ కార్యదర్శి తో కలిసి గ్రామ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులను ప్రణాళిక చేసుకొని చేపట్టేవారని వివరించారు. రోడ్లు డ్రైనేజీలు తాగునీరు వీధిదీపాలు పారిశుధ్యం వంటి గ్రామానికి అవసరమైన మౌలిక వసతుల పనులను అందుబాటులో ఉన్న నిధులతో నిర్వహించేవారన్నారు. పనులు పూర్తయిన అనంతరం సంబంధిత కాంట్రాక్టర్ కు సర్పంచ్ చెక్ పవర్ ద్వారా చెల్లింపులు చేసేవారని తెలిపారు. ఈ విధానం ద్వారాగ్రామపంచాయతీ కార్యకలాపాలు, అభివృద్ధి పనులు సజావుగా కొనసాగించారని తెలిపారు. తక్షణమే 2018 సంవత్సరం తీసుకువచ్చిన పంచాయతీ రాజ్ చట్టాన్ని మార్పులు చేసి గ్రామపంచాయతీల అభివృద్ధి కొరకు సర్పంచులకు న్యాయం చేయాలని కోరారు. ఇట్టి కార్యక్రమంలో సర్పంచ్ ల సంఘం రాష్ట్ర ప్రధాన రామ్ సింగ్ నాయక్, సిద్ధూ నాయక్, చిరంజీవి వివిధ మండలాల సర్పంచ్ లు సంఘం అధ్యక్షులు, వివిధగ్రామపంచాయతీల సర్పంచులు పాల్గొన్నారు.












