హైదరాబాద్, 9 September
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ముంబైలోనూ కీలక పాత్ర పోషించామని, త్వరలోనే చలో హైదరాబాద్ కార్యక్రమం చేపడతామని ముంబై తెలంగాణ ఉద్యమకారులు ప్రకటించారు. బుధవారం ముంబైలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
హైదరాబాద్ వస్తున్నాం అంటున్న ముంబై ఉద్యమకారులు హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ముంబై ప్రాంతంలోనూ కీలకంగా పోరాటాలు నిర్వహించామని భారత్ లేబర్ సేవా సంఘం ప్రముఖులు సాయిలు ముదిరాజ్ తెలిపారు. బుధవారం ముంబైలోని పశ్చిమ ములుండ్ తెలుగు అడ్డా వద్ద బీఎల్ఎస్ఎస్, ముంబై తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంటీజేఏసీ నాయకుడు ఏటం అజయ్ మాట్లాడుతూ హైదరాబాద్లో కేకే కమిటీ ఏర్పాటైనప్పటి నుంచి తమ ముంబై సమన్వయకర్తల బృందం మూడు సమావేశాలకు హాజరైందన్నారు. కమిటీ సూచనల మేరకు ఆధారాలతో త్వరలోనే ‘చలో హైదరాబాద్’ కార్యక్రమం చేపడతామని ప్రకటించారు. కార్యక్రమంలో సావరీ దత్తా యాదవ్, పొన్నాల అంజయ్య మహరాజ్, అందే శ్రీను, ఎం. మల్లేష్, కె. బనప్పా, బండి రమేష్, కాశీంభాయి, వి. వెంకటేష్ మహరాజ్ పాల్గొన్నారు.












