రంగారెడ్డి, 8 September
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు, దళిత స్పీకర్ పై బీఆర్ఎస్ నాయకుల వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేసీఆర్ ఫామ్ హౌస్ ఎదుట చావు డప్పు కొడతామని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేసిన వ్యాఖ్యలను వక్రీకరిస్తూ బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న రాజకీయ కుట్రలు సాగవని జిల్లా షాద్ నగర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మొహమ్మద్ అలీ ఖాన్ బాబర్, రఘునాయక్ లు స్పష్టం చేశారు.
*ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాటలను వక్రీకరించి ప్రచారం* *బడుగు వర్గాల ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పై మీ రాజకీయ కుట్ర సాగదు* *"పింకీ"ల బలుపు చర్యలకు భయపడం* *షాద్ నగర్ కాంగ్రెస్ నేతలు బాబర్ ఖాన్, రఘునాయక్* అసెంబ్లీకి రాకుండా ఫామ్ హౌస్ లోనే బందీ అయిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీరును ఎండగడుతూ, అదేవిధంగా దళిత స్పీకర్ గడ్డం ప్రసాద్ పట్ల బీఆర్ఎస్ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేసీఆర్ ఫామ్ హౌస్ ఎదుట చావు డప్పు కొడతామని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చెప్పడాన్ని కొన్ని సోషల్ మీడియా సంస్థలు బిఆర్ఎస్ నాయకులు కుమ్మక్కై రాజకీయంగా వీర్లపల్లి శంకర్ ను దెబ్బ తీయడానికి చేస్తున్న నాటకాలు సాగబోవు అని జిల్లా షాద్ నగర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మొహమ్మద్ అలీ ఖాన్ బాబర్, కాంగ్రెస్ గిరిజన ఆదివాసి కోఆర్డినేటర్ రఘునాయక్ లు స్పష్టం చేశారు. మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో వారు పేర్కొంటూ.. రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వ్యాఖ్యలను కొందరు గులాబీ నాయకులు సామాజిక మాధ్యమాల్లో తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని వాపోయారు. దౌర్జన్యాలకు గుండా గిరికి కేరాఫ్ అడ్రస్ గా మారుతున్న గులాబీ శ్రేణుల ఆగడాలు రాష్ట్రంలో మితిమీరి పోయాయని పేర్కొన్నారు. మహిళా ప్రజాప్రతినిధులను అడ్డం పెట్టుకుని నిన్న అసెంబ్లీ గేటు ఎదుట గులాబీ ప్రజాప్రతినిధులు సిగ్గులేకుండా పోలీసులపై దాడికి పాల్పడ్డారని మహిళా పోలీసుల పట్ల విచక్షణ రహితంగా వ్యవహరించారని పేర్కొన్నారు. హరీష్ రావు, ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి వ్యవహరించిన తీరు వీడియోలో స్పష్టంగా కనిపిస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. పింకిల బలుపు చర్యలకు కాంగ్రెస్ ప్రభుత్వం భయపడదని హెచ్చరించారు. ఫామ్ హౌస్ ఎదుట దళితులు చౌడపు మోగిస్తారని చెప్పే క్రమంలో కొందరు ఆ వీడియోలను రాద్ధాంతం చేస్తూ తప్పుడు మాటలను ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కు అంటగడుతూ విమర్శలు చేస్తున్నారని కొందరు గులాబీ శ్రేణులు తమ సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా ట్రోల్ చేస్తూ ఎన్నో మాటలు చెబుతున్నారని అది వారి విచ్చక్షణకే వదిలి వేస్తున్నామని అన్నారు. గురివింద చందంగా వ్యవహరిస్తున్న బిఆర్ఎస్ పార్టీ శ్రేణుల తీరును ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఒక బడుగు బలహీన వర్గాలకు చెందిన బిడ్డ వీర్లపల్లి శంకర్ ఎమ్మెల్యే అయితే కొంతమంది జీర్ణించుకోలేక ఆయన అభివృద్ధిని అడ్డుకునేందుకు లేనిపోని నిందలు మోపి విమర్శలు చేస్తున్నారని తెలిపారు. ఇవి సమంజసం కాదని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గొప్పతనాన్ని నియోజకవర్గంలో అడిగి తెలుసుకుంటే సరిపోతుందని ఎవరు ఏ పార్టీ ఘనులు ఏపాటి వారో ప్రజలకు తెలుసని అన్నారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పై అవకుల సేవకులు వెళితే కాంగ్రెస్ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. శంకర్ దిష్టిబొమ్మలు తగలబెట్టడం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేయడం వల్ల ఒరిగేది ఏమీ లేదని పెంకిల బలుపు చర్యలకు భయపడమని వాస్తవాలు ప్రజలకు తెలుసని అన్నారు. గులాబీ శ్రేణుల హైరానాను చూసి సిగ్గు జాలి వేస్తుందని అన్నారు. రాబోయే కాలంలో తగిన గుణపాటాలు తప్పవని భవిష్యత్తు ఎవరికి ఏం జరుగుతుందో కాలమే నిర్ణయిస్తుందని వారు అన్నారు..










