ముంబై, తెలంగాణ (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 08
తమ గుర్తింపు కోసం ఉద్యమిస్తున్న ముంబై తెలంగాణ ఉద్యమకారులు మంగళవారం పశ్చిమ బొరివలి నాకా వద్ద సన్నాహక సమావేశం నిర్వహించారు. తెలంగాణ యువజన కార్మిక సంఘం (టియుకెఎస్), ఎంటిజెఏసి ల ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో, తమ హక్కుల కోసం తెలంగాణ ప్రభుత్వాన్ని కలవాలని నిర్ణయించారు.
*తమ గుర్తింపు కోసం ఉవేత్తున లేస్తున్న ముంబై ఉద్యమకారులు* తెలంగాణ యువజన కార్మిక సంఘం (టియుకెఎస్), ఎంటిజెఏసి ల ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం ముంబై తెలంగాణ ఉద్యమకారుల సన్నాహక సమావేశం పశ్చిమ బొరివలి నాకా/ అడ్డా వద్ద జరిగింది. ఈ సందర్భంగా టియుకెఎస్ అధ్యక్షులు గాజుల మహేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కెకే కమిటి నియమించిన నిబంధనలకు కట్టుబడి తాము అన్ని రకాల ఆధారాలు సమర్పించనున్నట్లు, తగిన గుర్తింపు ఇవ్వాలని కోరారు. ఎంటిజెఏసి కో-కన్వీనర్ నారపాక లక్ష్మణ్ మహరాజ్, రమేష్ చౌవల్ మాట్లాడుతూ తాము నవీముంబై, భివండి, ముంబై వ్యాప్తంగా అనేక సంఘాలతో సమన్వయం చేస్తూ, త్వరలో ఉద్యమకారుల టీం తమ గుర్తింపు హక్కుల కోసం తెలంగాణ ప్రభుత్వాన్ని కలవనున్నట్లు ఈ సందర్భంగా వారు ప్రకటించారు. ఇట్టి కార్యక్రమానికి టియుకెఎస్ నాయకులు నీరటి భూమన్న, గంగాదరి లక్ష్మణ్, బండి సత్యనారాయణ, కన్నె పూర్ణచందర్, కొప్పుల వెంకటేష్, కాశయ్య మహరాజ్, మూలనివాసి మాలజీ పాల్గొని జై తెలంగాణ! జైజై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు.












