భారతీయ జనతా పార్టీ (బీజేపీ) దేశవ్యాప్తంగా రాష్ట్రాల పార్టీ వ్యవహారాల బాధ్యతల్లో కీలక మార్పులు చేసింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలకు కొత్త రాష్ట్ర ఇన్‌చార్జ్‌లు, సహ ఇన్‌చార్జ్‌లను నియమించారు. ఈ నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని పార్టీ ప్రకటించింది.
ఈ మార్పుల్లో మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి హర్యానా, ఛత్తీస్‌గఢ్ బాధ్యతలు అప్పగించారు. బీజేపీ సీనియర్ నేత సునీల్ బన్సల్‌కు తెలంగాణతో పాటు పశ్చిమ బెంగాల్ బాధ్యతలు ఇచ్చారు. తెలంగాణకు అభయ్ పాటిల్, రేఖా శర్మ సహ ఇన్‌చార్జ్‌లుగా నియమితులయ్యారు.
ఉత్తరప్రదేశ్ బాధ్యతలను వినోద్ తావ్డేకు అప్పగించారు. ఆయనకు జగదీశ్ పటేల్, మేధా కులకర్ణి, ప్రదీప్ వర్మ, అనంత్ ఓజా సహ ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరించనున్నారు.
ఇక రామ్ మాధవ్‌కు తమిళనాడు, ఉత్తరాఖండ్ బాధ్యతలు అప్పగించారు. హరీశ్ ద్వివేది బిహార్, కర్ణాటకకు ఇన్చార్జ్గా నియమితులయ్యారు. సతీశ్ పూనియాకు జమ్మూకశ్మీర్, పంజాబ్ బాధ్యతలు ఇచ్చారు. మహారాష్ట్రకు బైజయంత్ జయ్ పాండాను ఇన్చార్జ్గా నియమించారు.
ఆంధ్రప్రదేశ్ బీజేపీ వ్యవహారాలకు డా. అరవింద్ భదౌరియాను ఇన్చార్జ్గా, వనతి శ్రీనివాసన్‌ను సహ ఇన్చార్జ్గా నియమించారు. ఢిల్లీ బాధ్యతలను వినయ్ సహస్రబుద్ధేకు అప్పగించారు. రాజస్థాన్‌కు సంజయ్ భాటియా, గుజరాత్‌కు తరుణ్ చుగ్, హిమాచల్‌ప్రదేశ్‌కు శ్రీకాంత్ శర్మలను ఇన్‌చార్జ్‌లుగా నియమించారు.
బీజేపీ చేపట్టిన ఈ సంస్థాగత పునర్వ్యవస్థీకరణలో పలువురు నేతలకు ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాల బాధ్యతలు దక్కాయి. రాబోయే ఎన్నికలు, పార్టీ సంస్థాగత కార్యకలాపాలు, రాష్ట్ర యూనిట్లతో సమన్వయం వంటి అంశాల్లో కొత్త ఇన్‌చార్జ్‌లు కీలకంగా వ్యవహరించనున్నారు.
ముఖ్యంగా తెలంగాణకు సునీల్ బన్సల్‌ను ఇన్చార్జ్గా నియమించడం ఈ తాజా నియామకాలలో ప్రధాన అంశంగా నిలిచింది.












