కోకాపేట, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 08
తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ ను దూషించారనే ఆరోపణలపై పాలమూరు ఎమ్మెల్సీ ఎన్. నవీన్ రెడ్డిపై పోలీసులు ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. తెల్లవారుజామున ఆయన నివాసంలో పోలీసులు అరెస్ట్ చేసి, ఆసిఫాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీసుల తీరును ఎమ్మెల్సీ తీవ్రంగా ఖండించారు.
*ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి పై అట్రాసిటీ కేసు..!* *ఆసిఫాబాద్ పోలీస్ స్టేషన్ కు ముందుగా తరలింపు* *అటు నుండి మరో పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్న వైనం* *సభకు వచ్చి నిలదీస్తామని ముందస్తు అరెస్టులు* *అట్రాసిటీ కేసు పెట్టడం అక్రమం* *పాలమూరు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి* తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ ను దూషించారనే ఆరోపణలపై అరెస్టయిన పాలమూరు ఎమ్మెల్సీ, షాద్ నగర్ బిఆర్ఎస్ నేత ఎన్. నవీన్ రెడ్డిపై పోలీసులు ఎస్సీ అట్రాసిటీ కేసును నమోదు చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ ను నిన్న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా లోపలికి వెళుతున్న క్రమంలో జరిగిన రణరంగం నేపథ్యంలో మరో ఎమ్మెల్సీ తాతా మధు మరి కొంతమంది స్పీకర్ ను దుర్భాషలాడారని ఫిర్యాదులు పోలీసులకు అందాయి. ఈ నేపథ్యంలో పోలీసులు పలువురిపై ఎస్సీ అట్రాసిటీ కేసులు నమోదు చేసినట్లు తెలుస్తుంది. ఈ నేపద్యంలో ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి స్వగృహం కోకాపేటలో అతడిని తెల్లవారుజామున 5 గంటలకు పోలీసులు అరెస్టు చేశారు ఆ తర్వాత ఆయనను ఆసిఫాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు అనుచరులు చెప్పారు. అక్కడినుండి మరో పోలీస్ స్టేషన్ కు పోలీసులు తరలిస్తున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి మీడియాకు ఓ వీడియోని విడుదల చేశారు. అందులో తనపై అట్రాసిటీ కేసు పోలీసులు నమోదు చేశారని ఇది అక్రమం, దుర్మార్గమని ఖండించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను సభకు రానివ్వకుండా ముందస్తుగానే కుట్ర చేస్తుందని సభలో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడతామని భయపడి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతూ పోలీసుల చేత అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని నవీన్ రెడ్డి ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరో నాయకుడు హరీష్ రావు ఆదేశాల మేరకు తన పోరాటం కొనసాగుతుందని భయపడే ప్రసక్తే లేదని కేసులైన, నిర్బందాలైన ఎదుర్కొంటామని నవీన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు..












