కోడవలూరు, 9 September
మంత్రి శ్రీధర్ బాబుపై, ఆయన కుటుంబ సభ్యులపై బీఆర్ఎస్ నేత మధు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్ తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిలను తక్షణమే బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మంథని ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
బిచ్చగాడిలా ఊళ్లు తిరుగుతూ మంత్రి శ్రీధర్ బాబుపై మొరుగుతావా పిచ్చిపిచ్చిగా వాగితే తరిమికొడతాం ఖబడ్దార్ పదేళ్లు అధికారంలో ఉండి దళితుడిని సీఎం చేశారా దళితులకు భూమి, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఎవరికి ఇచ్చారో చెప్పాలి అని మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్ తీవ్రంగా మండిపడ్డారు. 80 శాతం ఆరు గ్యారెంటీలను అమలు చేసిన ఘనత కాంగ్రెస్ దేనని ఆయన అన్నారు.
దళిత స్పీకర్ను అవమానించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిలను బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మంథని ప్రెస్ క్లబ్లో మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్ ఈ వ్యాఖ్యలు చేశారు. మంథని నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకులు నోరు అదుపులో పెట్టు కపోతే ప్రజలే తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని ఆయన హెచ్చరించారు.
రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబుపై, ఆయన కుటుంబ సభ్యులపై నియోజకవర్గ బీఆర్ఎస్ నేత మధు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ రోజు మంథని డివిజన్ కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సెగ్గం రాజేశం గారి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ విలేకరుల సమావేశంలో తిరుపతి యాదవ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ నేతల తీరుపై నిప్పులు చెరిగారు.
మంత్రి శ్రీధర్ బాబును గానీ, వారి కుటుంబాన్ని గానీ విమర్శించే స్థాయి మధుకు లేదని, ఇకపైనా బూతులు మాట్లాడుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే మేం కూడా అదే పదజాలం వాడాల్సి వస్తుందని హెచ్చరించారు. భిక్షాటన చేసేవాడిలా నియోజకవర్గంలో రోజు మండలం తిరుగుతూ మధు పూట మాట మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
ఏ పార్టీకైనా ఎన్నికల మేనిఫెస్టో ఇవ్వడం సహజమని, అందులో చెప్పిన ఆరు గ్యారెంటీలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సహా దాదాపు 80 శాతం హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే అమలు చేసిందని గుర్తుచేశారు. మిగిలిన ఒకటి రెండు హామీలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని, వాటిని పట్టుకుని సన్నాసి మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లుచ్చా పనులు చేయడం కాంగ్రెస్ నేతలకు రాదన్నారు.
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో దళితుడిని ముఖ్యమంత్రి చేస్తామని, దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామని చెప్పి మాట తప్పారని తిరుపతి యాదవ్ దుయ్యబట్టారు. పదేళ్లలో దళితుడిని ఒక్క రోజైనా ముఖ్యమంత్రి చేశారా అని నిలదీశారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క ప్రధాన హామీనైనా బీఆర్ఎస్ నెరవేర్చిందా అని ప్రశ్నించారు. ప్రజల అవసరాలు పట్టించు కుండా గాలికొదిలేసిన బీఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు లేదన్నారు.
రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే.. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డి అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో శాసనసభాధిపతి (స్పీకర్) గడ్డం ప్రసాద్ ఒక దళితుడై ఉన్నందుకు, బీఆర్ఎస్ అగ్రనాయకత్వం కనుసన్నల్లోనే దళితులను కించపరచాలనే ఉద్దేశ్యంతోనే వారు అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీల తీరుపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయని, తప్పుగా మాట్లాడిన ఆ ఇద్దరినీ తక్షణమే ఎమ్మెల్సీ పదవుల నుండి బర్తరఫ్ చేయాలని సభ్య సమాజం రుకుంటోందని అన్నారు.












