మామడ (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 07
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నాయకులు లో ఆందోళన చేపట్టారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయం వద్ద ఈ నిరసన కార్యక్రమం జరిగింది.
ఎన్నికల హామీలు వెంటనే అమలు చేయాలి లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను ఇకనైనా కాలయాపన చేయకుండా వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. హామీల అమలులో జాప్యం చేస్తే ప్రజల తరఫున మరింత పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ కన్వీనర్ పాకాల చంద్రశేఖర్ గౌడ్, సోషల్ మీడియా ఇన్చార్జి మూగల రత్నయ్య, మేకం అశోక్, సాగర్, సాయి రెడ్డి, యూసుఫ్, పసి చిన్నయ్యతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.












