గణేష్ విగ్రహాల తుది నిమజ్జనాన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలతో పాటు రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించింది. ఈ సెలవుకు బదులుగా నవంబర్ 14, 2026న పనిదినంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
గణేష్ విగ్రహాల తుది నిమజ్జనాన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలతో పాటు రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించింది.
గణేష్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ నగరంలో భారీగా భక్తులు, శోభాయాత్రలు, వాహనాలు తరలివచ్చే అవకాశం ఉంది. దీంతో ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల రాకపోకలు సులభతరం చేయడం, భద్రతా ఏర్పాట్లకు సహకరించే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ సెలవును ప్రకటించింది.
ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఉత్తర్వులు జారీ చేశారు. సెలవు హైదరాబాద్, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలతో పాటు ఉత్తర్వుల్లో పేర్కొన్న రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల పరిధిలోని సంస్థలకు వర్తిస్తుంది.












